పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

✔️ సముద్రము, కొలనులు, సరస్సులు మరియు చెరువులు దగ్గర ఉంటే, వెంటనే దూరంగా వెళ్ళాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. ✔️ ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశుకాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. ✔️ కారు / బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి. ✔️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడవటం […]

  • Publish Date - May 4, 2021 / 09:55 AM IST

✔️ ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.

✔️ సముద్రము, కొలనులు, సరస్సులు మరియు చెరువులు దగ్గర ఉంటే, వెంటనే దూరంగా వెళ్ళాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.

✔️ ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశుకాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి.

✔️ కారు / బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి.

✔️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడవటం లేదా చర్మం జలదరింపు ఉంటే మెరుపు,పిడుగు రావడానికి సూచనగా భావించండి.

✔️ బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి . దీని వలన ఉరుములు , మెరుపుల నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

✔️ ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తరువాత కుడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి.

✔️ పిడుగు భాదితులను తాకవచ్చు. సత్వరమే వారికి సహాయం అందించండి.

✔️ పిడుగు భాదితుడిని వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.

పిడుగుపాటు సమయంలో చేయకూడనివి :-

✖️ ఉరుములు,మెరుపులు సంభవించినపుడు చెట్ల క్రింద , చెట్ల సమీపంలో , టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు.

✖️ ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్ వస్తువులు , ఇతర పరికరాలు చార్జ్డ్ ఫోన్లు/మొబైల్స్ వినియోగించరాదు.

✖️ పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు.

✖️ మోటారుసైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్థంబాలకు మరియు ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి.

✖️ వాహనంలో ఉండి ఉంటే లోహపు భాగాలను తాకరాదు.

కె.కన్నబాబు, కమిషనర్,తెలిపారు.

Latest News