సముద్రంలో శివలింగం ప్రత్యక్షం ..!
పురాతన శివలింగం ఒకటి సముద్రంలో వెలుగుచూడటం సంచలనం రేపింది. తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది.
పురాతన శివలింగం ఒకటి సముద్రంలో వెలుగుచూడటం సంచలనం రేపింది. తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది. పర్యాటకులు బీచ్‌లో స్నానాలు చేస్తుండగా వారికి శివలింగం కనిపించడంతో అంతా కలిసి అతి కష్టం మీద దానిని ఒడ్డుకు చేర్చారు. భక్తితో శివలింగానికి సముద్ర జలాలతో అభిషేకం చేసి పరవశించారు. శివలింగం దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం చేశారు.
సముద్ర జలాల్లో శివలింగం ప్రత్యక్షమైన సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అభిషేకాలు, పూజలు చేయడం ప్రారంభించడంతో బీచ్ ప్రాంతం పర్యాటక శోభతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా సంతరించుకుంది.
నెల్లూరు జిల్లా తూపిలిపాలెంలో బీచ్‌లో బయటపడ్డ శివలింగం..
యాత్రికులు బీచ్ లో స్నానాలు చేస్తుండగా కనిపించిన శివలింగం
శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తున్న స్థానికులు pic.twitter.com/KW1PfT6BMp
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 6, 2026
ఇవి కూడా చదవండి :
భారీ పొట్టతో మొసలి..కోసి చూస్తే షాకింగ్..!
రూ.142కోట్ల నెక్లెస్ తో ఫ్యాషన్ షోలో మెగా కృష్ణారెడ్డి భార్య సుధా !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram