Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. భారీగా రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ – బిట్రగుంట(07977-07978) రైలును ఈ నెల 27నుంచి జూన్ 23 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237-17238) రైలును మే 27 నుంచి 31 వరకు, జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు, జూన్ 17 నుంచి జూన్ 21 వరకు రద్దు చేసినట్లు చెప్పారు.
గుంటూరు-రాయగడ (17243-17244) ట్రైన్‌ను మే 27 నుంచి జూన్ 24 రద్దు అయ్యింది. ఇక కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (17267-17268) రైలును సైతం రద్దు చేశారు. మచిలీపట్నం-విజయవాడ (07896), విజయవాడ-మచిలీపట్నం (07769), విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సాపూర్ (07861), నర్సాపూర్-విజయవాడ (07863), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. ఆయా రైళ్లు విజయవాడ, రామవరప్పాడు మధ్య మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దయ్యాయి. అదే సమయంలో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా పలు రైళ్లను దారి మళ్లించారు.
ఎర్నాకులం-పాట్నా (22643), భావ్‌నగర్-కాకినాడ పోర్ట్ (12756), బెంగళూరు-గౌహతి (12509), ధన్‌బాద్-అలప్పుజ (13351), ఛత్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్ (11019), టాటానగర్-యశ్వంత్‌పూర్ (18111), హతియా-ఎర్నాకులం (22837), హతియా-బెంగళూరు (18637), హతియా-బెంగళూరు (12835), టాటానగర్-బెంగళూరు (12889) రైళ్లను దారి మళ్లించినట్లు వివరించింది. మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219) రైలును మే 27 నుంచి జూన్ 22 వరకు రద్దు చేశారు. తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (22708)ను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి (22707)డబుల్ డెక్కర్ రైలును సైతం రద్దు చేశారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram