Sriharikota | ఏడాదిగా జీతాల్లేని చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ ఇంజినీర్లు!

Sriharikota శ్రీహరికోట: చంద్రయాన్‌-3 విజయవంతంపై కేంద్రం గొప్పలు చెప్పుకొంటున్న వేళ.. ఆ ప్రయోగానికి వేదిక అయిన లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లకు ఏడాదిగా జీతాలు అందడం లేదన్న వార్త బయటకు వచ్చింది. ఈ నిర్మాణంలో రాంచీకి చెందిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ)కు చెందిన ఇంజినీర్లు భాగం పంచుకున్నారు. జీతాలు ఇవ్వకపోయినా సదరు సంస్థ మొబైల్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ను, ఇతర కీలకమైన సదుపాయాలను 2022 డిసెంబర్‌ నాటికే సిద్ధం చేసింది. హెచ్‌ఈసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. […]

Sriharikota | ఏడాదిగా జీతాల్లేని చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ ఇంజినీర్లు!

Sriharikota

శ్రీహరికోట: చంద్రయాన్‌-3 విజయవంతంపై కేంద్రం గొప్పలు చెప్పుకొంటున్న వేళ.. ఆ ప్రయోగానికి వేదిక అయిన లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లకు ఏడాదిగా జీతాలు అందడం లేదన్న వార్త బయటకు వచ్చింది. ఈ నిర్మాణంలో రాంచీకి చెందిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ)కు చెందిన ఇంజినీర్లు భాగం పంచుకున్నారు. జీతాలు ఇవ్వకపోయినా సదరు సంస్థ మొబైల్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ను, ఇతర కీలకమైన సదుపాయాలను 2022 డిసెంబర్‌ నాటికే సిద్ధం చేసింది.

హెచ్‌ఈసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. రాంచీలోని దుర్వా ప్రాంతంలో దీని ప్రధాన కేంద్రం ఉన్నది. అయితే.. వీరికి జీతాలు అందలేదని పలు వార్తలు వచ్చాయి. ఇక్కడ పనిచేస్తున్న 2,700 మంది కార్మికులకు, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలు అందలేదని మే నెలలోనే ఒక వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదే విషయంలో 2022 నవంబర్‌లో మరో వార్త వెలువడింది. తాజాగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. చంద్రయాన్‌ -3 విజయవంతంతో హెచ్‌ఈసీ సిబ్బంది మరోసారి తలెత్తుకుని నిలబడ్డారని లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలో భాగస్వామి అయిన సుభాష్‌ చంద్ర అనే ఇంజినీర్‌ చెప్పారు.

ఈ మహా కార్యంలో భాగస్వాములం కావడం తమకు సంతోషంగా ఉన్నదని అన్నారు. లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు హెచ్‌ఈసీ విన్నవించినా సదరు శాఖ చేతులెత్తేసిందని సమాచారం.