కృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై స్పందించిన..సూపరింటెండెంట్

కృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 6 ప్రాణాలు కోల్పోయారు అని వచ్చిన ఆరోపణల పై స్పందించిన సూపరింటెండెంట్ జయకుమార్.ఈ రోజు కోవిద్ వ్యాధి తీవ్రంగా ఉండి మాత్రమే పేషంట్లు చనిపోయారని ఆక్సిజన్ అందక చనిపోవడం కాదని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ వెహికల్ దారిలో ఉందని, ఈలోపు సిలెండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు.అనంతరం లిక్విడ్ ఆక్సిజన్ వెహికల్ రావటంతో దగ్గర ఉండి ఫీలింగ్ పరిస్థితి సమీక్షించారు. ఎప్పటికపుడు ఆక్సిజన్ లెవల్స్ ను పర్యవేక్షణ చేస్తున్నామని, […]

  • Publish Date - May 4, 2021 / 02:42 PM IST

కృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 6 ప్రాణాలు కోల్పోయారు అని వచ్చిన ఆరోపణల పై స్పందించిన సూపరింటెండెంట్ జయకుమార్.ఈ రోజు కోవిద్ వ్యాధి తీవ్రంగా ఉండి మాత్రమే పేషంట్లు చనిపోయారని ఆక్సిజన్ అందక చనిపోవడం కాదని తెలిపారు.

లిక్విడ్ ఆక్సిజన్ వెహికల్ దారిలో ఉందని, ఈలోపు సిలెండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు.అనంతరం లిక్విడ్ ఆక్సిజన్ వెహికల్ రావటంతో దగ్గర ఉండి ఫీలింగ్ పరిస్థితి సమీక్షించారు.

ఎప్పటికపుడు ఆక్సిజన్ లెవల్స్ ను పర్యవేక్షణ చేస్తున్నామని, పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దని హితవు పలికారు.

Latest News