టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన కుమారుడైన ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ నేషనల్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది.

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్

 

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన కుమారుడైన ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ నేషనల్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ను మరోసారి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేశ్‌ కిలార్‌లను పార్టీ నియమించింది.

మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా.. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చారు. పార్టీలోని సీనియర్లకు గౌరవమిస్తూ.. సామాజిక సమీకరణలు, నూతన నాయకత్వానికి అవకాశం వంటి కోణంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవులలో అవకాశం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77 మందిని నియమించారు.

రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. . 50 మంది మహిళలకు చోటు కల్పించారు. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు.  బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి చంద్రబాబు కొత్త కమిటీల కూర్పుపై కసరత్తు చేశారు.