కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాననడం దారుణం…
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న.వీటిని నిర్వహిస్తే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పోలీసులు, ఉపాధ్యాయులు వీరంతా కలిసి సుమారు 40 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుంది.. కరోనా వల్ల అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసిన ముఖ్యమంత్రి మొండిగా పరీక్షలు పెట్టేందుకు ముందుకు వెళ్లడం విచారకరం.ప్యాలెస్ లో ఉండి అన్ని పనులు చేసుకునే సీఎంకు పిల్లల ప్రాణాలతో సంబంధం లేదా? ఇతర రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేస్తే, ఇక్కడ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం […]

విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న.వీటిని నిర్వహిస్తే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పోలీసులు, ఉపాధ్యాయులు వీరంతా కలిసి సుమారు 40 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుంది..
కరోనా వల్ల అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసిన ముఖ్యమంత్రి మొండిగా పరీక్షలు పెట్టేందుకు ముందుకు వెళ్లడం విచారకరం.ప్యాలెస్ లో ఉండి అన్ని పనులు చేసుకునే సీఎంకు పిల్లల ప్రాణాలతో సంబంధం లేదా?
ఇతర రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేస్తే, ఇక్కడ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.పరీక్షలు నిర్వహించే క్రమంలో వీరిలో ఎవరైనా కరోనా బారినపడి మరణిస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.