క‌రోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ధాత‌: ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల సంఖ్య‌లో క‌రోనా బాధితులు చ‌నిపోతున్నార‌ని, అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం ప‌ట్ట‌ణాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటికే 35 మంది చనిపోయార‌ని పేర్కొన్నారు. అనంతపురంలో ఆక్సిజన్ లేక మరో నలుగురు చనిపోవడం బాధాకరమ‌న్నారు. ఏపీలో ప్రస్తుతం 480 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉంద‌ని, కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే ఈనెల 15 తర్వాత 1000 టన్నుల […]

  • Publish Date - May 5, 2021 / 05:22 AM IST

ధాత‌: ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల సంఖ్య‌లో క‌రోనా బాధితులు చ‌నిపోతున్నార‌ని, అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం ప‌ట్ట‌ణాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటికే 35 మంది చనిపోయార‌ని పేర్కొన్నారు.

అనంతపురంలో ఆక్సిజన్ లేక మరో నలుగురు చనిపోవడం బాధాకరమ‌న్నారు. ఏపీలో ప్రస్తుతం 480 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉంద‌ని, కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే ఈనెల 15 తర్వాత 1000 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంద‌ని తెలిపారు. కరోనా ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల‌ని కోరారు. క‌రోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాల‌ని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Latest News