మానవత్వం మంటకలిసింది రాజాంలో ఓప్రేవేట్ హాస్పిటల్ లో ఘటన
జిల్లాలోని రాజాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే […]

జిల్లాలోని రాజాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు.
అయితే క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు.
ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. మృతురాలిది రాజాం మండలం పెంటఅగ్రహారం. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 108కు కాల్ చేసినా స్పందించలేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు.