విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇక చెప్పేదేమీ లేదు…. రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు ఇదే!

రాజ్యసభలో విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రశ్నబదులిచ్చిన కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని ఉద్ఘాటనమరో ఆలోచనకు తావులేదని స్పష్టీకరణ విధాత:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా, కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని,నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని […]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇక చెప్పేదేమీ లేదు…. రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు ఇదే!

రాజ్యసభలో విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రశ్న
బదులిచ్చిన కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు
100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని ఉద్ఘాటన
మరో ఆలోచనకు తావులేదని స్పష్టీకరణ

విధాత:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా, కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని,నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చినందున ఇకపై చెప్పేదేమీ లేదని కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టారు.అయితే, ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు,వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామని భగవత్ కిషన్ రావు వెల్లడించారు.