మహిళపై దాడి ఘటనలో ముగ్గురి అరెస్టు

గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలో ఓ మహిళపై జరిగిన దాడిలో ముగ్గుర్ని అరెస్టు చేశామని గుంతకల్లు రూరల్ సి.ఐ రియాజ్ అహ్మద్ తెలిపారు. నక్కనదొడ్డి గ్రామంలో వామిదొడ్డి స్థలం విషయంలో లక్ష్మిదేవి… లింగమయ్య కుటుంబాల మధ్య గత కొంత కాలంగా సమస్య ఉందన్నారు. ఇదే సమస్య విషయంలో ఈనెల 24 తేదీన లక్ష్మిదేవిపై లింగమయ్య, ఇతని కుమారులు సురేష్ , వెంకటేష్ , శ్రీనివాసులులు దాడి చేసి ధూషించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో లింగమయ్య, ఇతని ముగ్గురు […]

మహిళపై దాడి ఘటనలో ముగ్గురి అరెస్టు

గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలో ఓ మహిళపై జరిగిన దాడిలో ముగ్గుర్ని అరెస్టు చేశామని గుంతకల్లు రూరల్ సి.ఐ రియాజ్ అహ్మద్ తెలిపారు. నక్కనదొడ్డి గ్రామంలో వామిదొడ్డి స్థలం విషయంలో లక్ష్మిదేవి… లింగమయ్య కుటుంబాల మధ్య గత కొంత కాలంగా సమస్య ఉందన్నారు. ఇదే సమస్య విషయంలో ఈనెల 24 తేదీన లక్ష్మిదేవిపై లింగమయ్య, ఇతని కుమారులు సురేష్ , వెంకటేష్ , శ్రీనివాసులులు దాడి చేసి ధూషించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

దీంతో లింగమయ్య, ఇతని ముగ్గురు కుమారులపై దాడితో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామన్నారు. (Cr.No.91/2021 U/s 323 r/w 34 IPC and Sec 3 (1) (r) (s) SC/ST POA ACT of guntakal rural ps) ఈ నలుగురు నిందితుల్లో సురేష్ , వెంకటేష్ , శ్రీనివాసులులను ఈరోజు అరెస్టు చేశామని… లింగమయ్యను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.