కోరిక తీర్చాలంటూ మహిళా వీఆర్వో ఇంటికెళ్లిన ఎమ్మార్వోకు దేహశుద్ధి
తిరుపతి జిల్లాలో ఎమ్మార్వో చేసిన అసభ్య ప్రవర్తన కలకలం రేపుతోంది. వీఆర్వోపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మార్వోకు బాధితురాలి తల్లి చెప్పులతో దేహశుద్ధి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మహిళా సంఘాలు అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

విధాత: తిరుపతి జిల్లాలో కామాంధుడైన ఓ ఎమ్మార్వోకు దేహశుద్ది ఘటన సంచలనంగా మారింది. నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా వీఆర్వోను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. ‘మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?’ అని మెసేజ్ పెట్టాడు. నిన్న బరితెగించి ఆమె ఇంటికి వెళ్లాడు. దుస్తులు విప్పేసుకుని తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీంతో వీఆర్వో తన తల్లికి సమాచారం ఇచ్చింది.
మధమెక్కిన పశువులా మారిన ఎమ్మార్వోను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి అధికారిని సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.