శివయ్య కన్ను తెరిచాడు..దర్శనం కోసం భక్తుల పరుగు

శివయ్య కన్ను తెరిచాడు..దర్శనం కోసం భక్తుల పరుగు

విధాత : సాయిబాబా విగ్రహం..వినాయక విగ్రహం పాలు తాగుతున్నాయంటూ గతంలో వైరల్ అయిన ఘటనల తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. శివలింగం కళ్లు తెరిచిందంటూ జనం తండోపతండాలుగా చూసేందుకు బారులు తీరిన ఘటన వైరల్ గా మారింది. తిరుపతి గోవిందరాజు సత్రాల కాంపౌండ్‌లోని శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి డీఆర్ మహల్ రోడ్డులోని గాంధీపురం పురాతన జాంభవ మఠం రామేశ్వర మునిరాత్మ శ్రీ రామలింగేశ్వర స్వామి శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచిందంటూ భక్తులు మహాశివుడిని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.

భక్త కన్నప్ప సినిమాలో చూపిన మాదిరిగా శివలింగంలో శివయ్య రెండుకళ్లు తెరిచారని కొందరు..విభూతితో కళ్లను కృత్రిమంగా చేతితో తీర్చిదిద్దారని మరికొందరు భావిస్తున్నారు. ఈ వింతను చూసేందుకు నిన్న రాత్రి 9 గంటల నుంచి కొనసాగుతున్న భక్తుల రద్ధీ కొనసాగుతునే ఉంది. భక్తుల తాకిడికి పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ శివయ్యనే భక్తుల కోసం దిగివచ్చాడంటూ భక్తులు భావిస్తు పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు.