Andhra Pradesh : తిరుమల సన్నిధానం హోటల్ లో అక్రమాలు : భూమన
భూమన కరుణాకర్ రెడ్డి: తిరుమల సన్నిధానం హోటల్ లో రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్.

అమరావతి : తిరుమల సన్నిధానం హోటల్ లో రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ అక్రమాల దందా నడిచిందని ఆరోపించారు. గతంలో సన్నిధానం క్యాంటీన్ ను అద్దె కట్టలేదని మూసేశారని, 2024 డిసెంబర్ లో సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించాలని జీవో ఇచ్చారని వెల్లడించారు. రూ.2 కోట్ల 85 లక్షల అద్దె బాకీ ఉంటే రూ.కోటి 24 వేలు మాత్రమే కట్టారన్నారు.
బీఆర్ నాయడు దగ్గరుండి క్యాంటీన్ ని ప్రారంభించారని, ఓ హోటల్ కు రూ.2 కోట్ల లాభం చేకూర్చారని భూమన ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలు మతలబు ఏంటి? అని దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపాలని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.