ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలు: రామకృష్ణ
విధాత,విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలుండడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ 2014 ఏప్రిల్ అంచనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమివ్వడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రులు పదే పదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. […]
విధాత,విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలుండడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ 2014 ఏప్రిల్ అంచనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమివ్వడం దుర్మార్గమన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రులు పదే పదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన తరుణమిదని రామకృష్ణ పిలుపిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram