ఇంద్రకిలాద్రిపై యువతి రీల్ వివాదస్పదం

ఏపీ విజయవాడ ఇంద్రకిలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం రాజగోపురం ఎదుట ఓ యువతి రీల్ చేయడం వివాదస్పదమైంది. అది కాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఆలయ భద్రతా వైఫల్యాలను ప్రశ్నార్థకం చేసింది.

అమరావతి: ఏపీ విజయవాడ ఇంద్రకిలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం ఎదుట ఓ యువతి రీల్ చేయడం వివాదస్పదమైంది. ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట రీల్స్ చేస్తూ ఓ యువతి డాన్స్ చేసి ఇంస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదస్పదమైంది. రాజగోపురం ముందు (దుర్గ గుడి చైర్మన్ కార్యాలయం సమీపంలో) రీల్స్ చేసిన వీడియోతో ఆలయంలోని భద్రత లోపాలు బట్టబయలయ్యాయంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.

పవిత్ర పుణ్యక్షేత్రంలో సెల్‌ఫోన్‌ల నిషేధం నిబంధనలు ఉన్నప్పటికీ, ఆలయ భద్రతా సిబ్బందిని దాటి ఇలాంటి వీడియోలు తీయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా లోపాలపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వీడియోపై విచారణ చేపట్టారు. మరోవైపు ఆషాఢ మాసం పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.

 

Latest News