YS Jagan : సీబీఐ కేసులో వైఎస్ జగన్‌కు ఊరట
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టివేసింది. లండన్‌లో తన కుమార్తెను చూసేందుకు వెళ్లిన జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించి పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈ నెల 11న లండన్ వెళ్లారు. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఆయన తన సొంత ఫోన్ నంబర్‌ను వెల్లడించలేదని సీబీఐ పిటిషన్ పేర్కొంది.
లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్‌కి కాల్ చేసినా తను ఇచ్చిన ఫోన్ నెంబర్ పని చేయలేదని పిటిషన్‌లో ఆరోపించింది. ఉద్దేశ పూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదించింది. ఈ పిటీషన్ లో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థఆనం సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram