అభివృద్ధి,సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్
అభివృద్ధికి నడకలు నేర్పిన నేత …మీ బాటలోనే నడచి మీ ఆశయాలను నెరవేరుస్తాం…మహానేత వైఎస్ఆర్ 72 వ జయంతివేడుకల సంధర్బంగా రామపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. విధాత :అభివృద్ధి,సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్ఆర్ 72 వ జయంతి సందర్భంగా రామాపురంలోని వై ఎస్ ఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి […]

అభివృద్ధికి నడకలు నేర్పిన నేత …
మీ బాటలోనే నడచి మీ ఆశయాలను నెరవేరుస్తాం…
మహానేత వైఎస్ఆర్ 72 వ జయంతివేడుకల సంధర్బంగా రామపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
విధాత :అభివృద్ధి,సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్ఆర్ 72 వ జయంతి సందర్భంగా రామాపురంలోని వై ఎస్ ఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వై ఎస్ ఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, అర్హులందరికీ ఇళ్ళు, ఉచిత విద్యుత్,రుణ మాపీ,ఫీజు రీయంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
రాష్ట్రంలోని ఎన్నో నీటి ప్రాజెక్ట్ లతో పాటు మన ప్రాంతం లోని వెలిగల్లు, జరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్ట్ లను నిర్మించిన ఘనత ఆ మహానేత కే దక్కుతుందన్నారు. మన రాయచోటి వాసులపై వై ఎస్ ఆర్ ప్రత్యేక అభిమానం చూపేవారని ఆయన గుర్తు చేశారు. రాయచోటి పట్టణ దాహార్తిని తీర్చారని, రింగ్ రోడ్డు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తో పాటు ఎన్నో విద్యా సంస్థలు, అభివృద్ధి పనులు చేసారని ఆయన గుర్తు చేసుకున్నారు.వైఎస్ఆర్ బాటలోనే పయనించి వారి ఆశయాలను సాధిస్తామన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వారి తరహాలోనే మరింత మంచి పాలన అందిస్తున్నారన్నారు. వైఎస్ ఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. రైతన్నల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జోహార్ వై ఎస్ ఆర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు కార్యకర్తలు, నాయకులు చేశారు.