విధాత : ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడమే వైసీపీ పాలన విధానమని, చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారని సీఎం జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూల్‌లో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి ఎన్నికలప్పుడు మళ్లీ సిద్దమా అని బలుయదేరారని, ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా? దేనికి సిద్దమని షర్మిల ప్రశ్నించారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని చేయలేదని, కనీసం మంచినీళ్లు లేవన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేయలేదని, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పగా ఎక్కడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, విద్యుత్తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారని విమర్శించారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడమే వైసీపీ పాలసీ: వైఎస్ షర్మిల
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడమే వైసీపీ పాలన విధానమని, చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారని సీఎం జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

Latest News
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...
ముట్టుకుంటే మసే.. 'సుందరమైన' మృత్యు సరస్సు
గడ్డకట్టిన సరస్సులో ఫోటోల ప్రయత్నం.. ఇద్దరు మృతి
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..
100 ఏళ్ల తర్వాత బుధాదిత్య రాజయోగం..! ఈ నాలుగు రాశుల వారు కొత్త ఇల్లును కొనడం ఖాయం..!!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి సోదరుల నుంచి ఊహించని ధన సహాయం..!
సంచలన కాంబినేషన్లతో మెగా158? ఐశ్వర్యారాయ్ తెలుగులోకి..!
18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?