Beauty tips | నడుము చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే ఈ ఐదు మార్నింగ్ డ్రింక్స్ గురించి మీకు తెలుసా..?

Beauty tips : నడుము చుట్టూ వేలాడుతూ కనిపించే బెల్లీ ఫ్యాట్ మనిషిని అంద విహీనంగా కనిపించేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్‌తో చాలా మంది బాధపడుతుంటారు. అయితే తరచూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. ఇవన్నీ పాటించడం ఇప్పటి తరాలకు కొంచెం కష్టమైన పనే.

Beauty tips | నడుము చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే ఈ ఐదు మార్నింగ్ డ్రింక్స్ గురించి మీకు తెలుసా..?

Beauty tips : నడుము చుట్టూ వేలాడుతూ కనిపించే బెల్లీ ఫ్యాట్ మనిషిని అంద విహీనంగా కనిపించేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్‌తో చాలా మంది బాధపడుతుంటారు. అయితే తరచూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. ఇవన్నీ పాటించడం ఇప్పటి తరాలకు కొంచెం కష్టమైన పనే. కానీ పాటిస్తేనే ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఓ ఐదు రకాల మార్నింగ్ డ్రింక్స్ కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో తోడ్పడుతాయి. ఆ ఐదు రకాల డ్రింక్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మ నీళ్లు

నిమ్మ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. నిమ్మ నీళ్లలో ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుంది. నిమ్మకాయతో జీర్ణక్రియ మెరుగుపడి, ఫ్యాట్‌ కరుగుతుంది. ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో అర చెక్క నిమ్మ రసాన్ని పిండుకొని పరగడుపున తాగాలి. ఇందులో కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా మెటాలిజంను పెంచుతుంది. ఇది క్యాలరీలను కూడా త్వరగా కరిగించేస్తుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. గ్రీన్ టీలో కొద్ది మొత్తంలో కెపాన్ కూడా ఉంటుంది. ఇది ఎనర్జీని పెంచుతుంది. మార్కెట్లో గ్రీన్ టీ బ్యాగులు అందుబాటులో ఉంటాయి. వాటిని కొద్ది నిమిషాలపాటు వేడి నీటిలో వేసుకొని పరగడుపున తీసుకోవడంవల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో నిమ్మరసం, తేనె కూడా కలిపి తీసుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్..

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇది బీపీ, షుగర్ లెవెల్స్‌ను కూడా తగ్గిస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. కొవ్వును కరిగించేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్‌లు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలుపుకుని తాగాలి. దీనిలో కూడా కావాలంటే తేనె కలుపుకోవచ్చు.

అల్లం టీ

అల్లం టీ తో కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అల్లంలో కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. అల్లం ఆకలిని నియంత్రిస్తుంది. దాంతో అతిగా తినాలనిపించదు. అందుకే ఇది బెల్లీ ఫ్యాట్‌ను త్వరగా కరిగించేస్తుంది. అల్లం టీని కూడా అవసరమైతే తేనె కలుపుకుని తీసుకోవచ్చు.

పుదీనా, కీరదోస డ్రింక్‌

పుదీనా, కీరదోస కాయతో తయారు చేసిన డ్రింక్‌ తీసుకోవడం వల్ల నాచురల్ డిటాక్సిఫికేషన్ అవుతుంది. శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. కడుపులో అజీర్తిని తగ్గిస్తుంది. కీరదోసను కట్ చేసి పుదీనా కూడా వేసి నీళ్లలో రాత్రంతా ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఉదయం పరగడుపున తాగాలి.