Beauty tips | మీ పసుపు రంగు పంటివరుస తెల్లగా మారాలా.. అయితే ఈ ఫలాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి..!
Beauty tips : దంతాలు పసుపు రంగులోకి మారితే నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అదే దంతాలు తెల్లగా ఉంటే మీ నవ్వు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించడం ద్వారా లేదంటే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ పండ్లేమిటో ఇప్పుడు చూద్దాం..

Beauty tips : దంతాలు పసుపు రంగులోకి మారితే నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అదే దంతాలు తెల్లగా ఉంటే మీ నవ్వు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. చాలామంది ఈ పసుపు రంగు దంతాలతో, దంతాలపై గారలతో ఇబ్బంది పడుతుంటారు. తమ దంతాలను తెల్లగా మార్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వంటింటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించడం ద్వారా లేదంటే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ పండ్లేమిటో ఇప్పుడు చూద్దాం..
పండ్లను తెల్లగా మార్చే ఫలాలు..
- దంతాల పసుపు రంగును పోగొట్టుకోవాలంటే మీరు రోజూ తినే ఆహారంలో పుచ్చకాయ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, అనాస పండును చేర్చుకోవాలి. ఈ ఫలాల్లో బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలపై పేరుకున్న మరకలను క్లియర్ చేయడంలో సాయపడుతుంది.
- స్ట్రాబెర్రీ, బొప్పాయి లాంటి పండ్లు లాలా జలాన్ని పెంచుతాయి. దీని కారణంగా దంతాల చుట్టూ పేరుకున్న కణాలు, బ్యాక్టీరియా సులభంగా తొలగిపోతాయి.
- అనాస పండు కూడా దంతాల మీద పసుపు రంగును తొలగించడంలో సాయపడుతుంది. ఆనాస పండులో పపైన్, బ్రోమెలైన్ ఎంజైమ్‌లు ఉన్నాయి. ఈ ఎంజైమ్‌లు దంతాల మీద ఉన్న పసుపు మరకలను తొలగించడానికి సాయపడుతాయి. దాంతో దంతాలు శుభ్రంగా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి.
- దంతాల మీద పసుపు రంగును పోగొట్టుకోవడానికి ఈ పండ్లను తినడంతోపాటు కొన్ని పనులను కూడా చేయాలి. దంతాల రంగుని మార్చే ఆహారానికి, పానీయాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలతోపాటు వైన్ లాంటివి దంతాల రంగును మారుస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండాలి.