లంక‌లో ద‌గ్గుబాటి రాముడి క‌ళ్యాణం… ద‌గ్గుబాటి వారి కోడ‌లు ఫోటో ఔట్..!

లంక‌లో ద‌గ్గుబాటి రాముడి క‌ళ్యాణం… ద‌గ్గుబాటి వారి కోడ‌లు ఫోటో ఔట్..!

గ‌త కొద్ది రోజులుగా ద‌గ్గుబాటి వారింట పెళ్లి హంగామా కొన‌సాగుతుండ‌గా, ఆ పెళ్లి వేడుక‌కి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బ‌య‌ట‌కు రాలేదు. ద‌గ్గుబాటి సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ త‌న మ‌ర‌ద‌లు వ‌రుస అయిన ప్రత్యూష చాపరాలను పెళ్లి చేసుకుంటాడ‌ని ప్ర‌చారం జ‌రిగిన కూడా ద‌గ్గుబాటి కొత్త కోడ‌లు ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలో ఉంది. అయితే ఎట్ట‌కేల‌కి అభిరామ్ స‌తీమ‌ణి పిక్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో అభిరామ్, ప్ర‌త్యూష పెళ్లి దుస్తుల‌లో క‌నిపిస్తుండ‌గా, వారి పిక్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మధ్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువని ఆమె స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది.

సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్‌లో పెళ్లి వేడుక ఏర్పాటు చేశారు. కేవ‌లం, కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ వివాహ వేడుక జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఇక పెళ్లి త‌ర్వాత ఈ రోజు తిరిగి వారు హైద‌రాబాద్‌కి రానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, రేపు లేదా ఎల్లుండి రిసెప్ష‌న్ వేడుక జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఈ రిసెప్ష‌న్ వేడుక‌కి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజరై సంద‌డి చేయ‌నున్నారు. ఇక పెళ్లి కోసం వెంకటేష్‌, రానా, నాగ చైత‌న్య వంటి వారు రెండు రోజుల ముందే శ్రీలంక‌కి వెళ్లిన‌ట్టు స‌మాచారం.

ఇక అభిరామ్ విష‌యానికి వ‌స్తే దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఇటీవలే హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి రానా రజనీకాంత్ సినిమా ‘తలైవర్ 170’ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రాజెక్టు ‘హిరణ్యకశ్యప’ తో కూడా బిజీగా ఉన్నారు.ద‌గ్గుబాటి హీరోలు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకోవాల‌ని కృషి చేస్తున్నారు.