జాకెట్ విప్పి పింక్ సూట్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుప‌మ‌.. ఆమె అందాల‌కి అంద‌రు ఫిదా

జాకెట్ విప్పి పింక్ సూట్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుప‌మ‌.. ఆమె అందాల‌కి అంద‌రు ఫిదా

మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలతో ప్రేక్ష‌కులని ఎంత‌గానో అలరించింది. అఆ అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ తొలి సినిమాలోనే త‌న ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టింది. అమ్మ‌డి అందం, అభిన‌యానికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. ఇక ఆ త‌ర్వాత శర్వానంద్ జోడిగా శతమానం భవతి సినిమాలో మెరిసింది . ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో ఇక బ్యాక్ టూ బ్యాక్ ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంది. ఈ ఏడాది కార్తీకేయ, 18 పేజెస్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది . అయితే కెరీర్ మొదట్లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన అనుప‌మ ఇప్పుడు మాత్రం హ‌ద్దులు చెరిపేస్తూ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది.

సోషల్‌ మీడియాలో, ఇటు పాత్రల పరంగానూ అనుప‌మ‌లో చాలా చేంజ్ వ‌చ్చింది. ఆమె అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసి అంద‌రికి పెద్ద షాకే ఇస్తుంది. స్కిన్ షో చేస్తూ మైండ్‌ బ్లాక్ చేస్తున్న ఈ భామ ఓ వైపు కవ్వించే పోజులు, మరోవైపు అందాల విందు చేస్తూ అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.రోజురోజుకి కుర్రాళ్ల‌ని త‌న ఫాలోవ‌ర్స్‌గా మార్చుకుంటూ వ‌స్తుంది అనుప‌మ‌. తాజాగా అందాల గేట్లు ఎత్తివేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. జాకెట్ విప్పేసి పిక్ క‌ల‌ర్ డ్రెస్‌లో అనుప‌మ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. అమ్మ‌డు తీరు చూస్తుంటే ఆమె గ్లామ‌ర్ షోకి ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోలేద‌ని అర్ధ‌మ‌వుతుంది.

అనుప‌మ కొద్ది రోజుల క్రితం విడుద‌లైన `రౌడీబాయ్స్` చిత్రంలో హీరోకి లిప్‌లాక్‌ పెట్టి ఒక్కసారిగా ట్రోల్‌కి గురయ్యింది. నిర్మాత కొడుకైతే లిప్‌ లాక్‌ పెడతావా? అంటూ ఆమెని తెగ ఆడేసుకున్నారు.ఆ త‌ర్వాత కొన్ని రోజుల పాటు అటు వైపు వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం డీజే టిల్లు స్కైర్‌లో న‌టిస్తుంది. ఇందులో లిప్ లాక్‌ పెడుతూ రచ్చ చేస్తుంది. ఇందులో బోల్డ్ గా ఆమె పాత్ర ఉండటం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఇప్పటికే విడుదలై సాంగ్‌, గ్లింప్స్ లో తానేంటో చాటుకోగా, అనుప‌మ ఇందులోను కుర్రాళ్ల‌కి మంచి ఫీస్ట్ ఇవ్వ‌డం ఖాయంగా చెబుతున్నారు. ఇక ఈ అమ్మ‌డు సిరెన్‌`, `ఈగల్‌`తోపాటు ఓ మలయాళ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.