Minister Azharuddin : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అజారుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహి అంటూ తప్పుడు ఆరోపణలు చేసినందుకు లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

Minister Azharuddin : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్

విధాత, హైదరాబాద్ : తనను నేరస్తుడు..దేశ ద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి సీరియస్ గా స్పందించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలను అజారుద్ధీన్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఓన్యూస్ చానల్ తో మాట్లాడిన అజారుద్దీన్ మరోసారి తనపై కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. కిషన్ రెడ్డి నన్ను దేశ ద్రోహి అంటూ తప్పుడు ఆరోపణలు చేయడంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. నాపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. నేను దేశం కోసం క్రికెట్ ఆడి అనేక విజయాలు అందించి దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటానని..అటువంటి నేను దేశ ద్రోహినా అని అజార్ ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయాల కోసం బీజేపీ నన్ను టార్గెట్ చేసిందని ఆరోపించారు. మాట్లాడటానికి ఏమి లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు? కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని అజారుద్దీన్ విమర్శించారు. చట్టసభలలో సభ్యుడు కాకుండానే మంత్రి అయిన అజారుద్ధీన్ ఆరు నెలలోపు ఎమ్మెల్సీ కాలేరని, దీంతో ఆయన మంత్రి పదవి ఆర్నేళ్ల ముచ్చటేనంటూ వస్తున్న విమర్శలపై అజార్ స్పందించారు. అటువంటి విమర్శలన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి తన కెప్టెన్ అని, ఆయన ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తానన్నారు.