బిగ్ బాస్ 7 ఫినాలే ఎప్పుడు.. ఈ సారి ఎవరు ఊహించని ట్విస్ట్లు…!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఆరు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఏడో సీజన్ జరుపుకుంటుంది. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా కావడంతో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.బిగ్బాస్ ఇప్పటికే 11 వారాలు పూర్తిచేసుకొని 12వ వారం సాగుతుంది. హౌస్ లో మొదట 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరు అలా అయిదు వారాల తర్వాత అయిదుగురు ఎలిమినేట్ అవ్వగా ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి బిగ్ బాస్ పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎలిమినేట్ అయి వెళ్లిన రతికని కూడా బిగ్ బాస్ హౌజ్లోకి కూడా పంపారు. మొత్తంగా బిగ్ బాస్ హౌజ్లో ఇప్పుడ పది మంది ఉన్నారు. వారు అమర్ దీప్, గౌతమ్, యావర్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి, అశ్విని,రతిక. ఈ పది మందిలో ఒకరు కప్ కొట్టుకొని వస్తారు.
అయితే సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుండడంతో షోని కొద్ది వారాల పాటు పొడిగించే ఆలోచన నిర్వాహకులు చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని తర్వాత ఆ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న నిర్వహించబోతున్నట్లు టాక్. దీని గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని దాదాపు అదే రోజు ఫినాలే ఉంటుందని అంటున్నారు. ఇక ప్రతి సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫైనల్ వరకు వెళుతుండడం మనం చూస్తున్నాం. కానీ ఈ సీజన్ ఉల్టా పల్టా కాబట్టి టాప్ 7 ని ఫైనల్ కి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఇదే జరిగితే అర్జున్, రతిక వంటి వారు కూడా ఫినాలేకి వెళ్లనుండడం ఖాయం . ప్రస్తుతం హౌస్ లో ఉన్న 10 మందిలో ఇక ముగ్గురు మాత్రమే ఎలిమినేట్ చేసి టాప్ 7ని ఫినాలేకి తీసుకెళ్లొచ్చు. అంతా ఉల్టా పుల్టా కాబట్టి ఎప్పుడు ఏదైన జరగొచ్చు. మరి ఈ సీజన్లో అబ్బాయిలు కప్ కొడతారా, లేకుంటే అమ్మాయిలు కప్ కొడతారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.