Tourism Investments : పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు

టూరిజం రంగంలో ₹7,045 కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాలు. భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యాటక ప్రాజెక్టులకు భారీ ఎంవోయూలు. హైదరాబాద్‌లో కొత్త ఆకర్షణలు రానున్నాయి.

Tourism Investments : పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజున తెలంగాణ పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులతో కూడిన ఒప్పందాలు జరిగాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున, పర్యాటక రంగంలో ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్రానికి దక్కాయి. సమ్మిట్ ప్రాంగ‌ణంలో సీఎం రేవంత్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మ‌క్షంలో దేశీయ, అంతర్జాతీయ సంస్థల ప్ర‌తినిధులు ఈ మేరకు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 40 వేల‌ మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, ఇందులో ప్రత్యక్షంగా10 వేల, పరోక్షంగా 30 వేల‌ మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

పెట్టుబ‌డుల వివ‌రాలు:

రూ. 3,000 కోట్లు – ఫుడ్‌లింక్ ఎఫ్‌&బి హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
భారత్ ఫ్యూచర్ సిటీలో పీపీపీ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్, ట్రేడ్ & ఎగ్జిబిషన్ సెంటర్

రూ. 1,000 కోట్లు – డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్ & రిసార్ట్స్ , భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి గోల్ఫ్ డెస్టినేషన్

రూ.1,000 కోట్లు సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం

రూ. 800 కోట్లు అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) హైదరాబాద్‌లో ఎలైట్ అంతర్జాతీయ వెల్‌నెస్ రిట్రీట్ (అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆరోగ్య కేంద్రం)

రూ. 300 కోట్లు పోలిన్ గ్రూప్ (టర్కీ) & మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఆక్వా మెరైన్ పార్క్ & ఆక్వా టన్నెల్

రూ. 300 కోట్లు ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్పెయిన్) హైదరాబాద్‌లో కృత్రిమ బీచ్ (Artificial Beach), లగూన్ & రిసార్ట్ ప్రాజెక్ట్

రూ. 300 కోట్లు శ్రీ హవిష హాస్పిటాలిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్‌లో స్మార్ట్ మొబిలిటీ వెల్‌నెస్ రిసార్ట్ & కన్వెన్షన్ సెంటర్

రూ. 200 కోట్లు కేఈఐ గ్రూప్ & అసోసియేట్స్ (కామినేని గ్రూప్) కిస్మత్‌పూర్ గ్రామం, గండిపేట వద్ద గ్లాస్‌హౌస్-గ్రీన్‌హౌస్ కన్వెన్షన్ సెంటర్

రూ. 120 కోట్లు రిధిరా గ్రూప్, యాచారం, భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద నోవోటెల్ బ్రాండెడ్ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్

రూ. 25 కోట్లు సలాం నమస్తే దోస హట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) & విజ్యాగ్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వెంచర్ & ఈకో-టూరిజాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ అంతటా కారవాన్ పార్కులు

వ్యూహాత్మక భాగస్వామ్యాలు (Strategic Partnerships):

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ & యానిమేషన్: IIFA ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్‌ల కోసం భాగస్వామ్యం; దీని ద్వారా ₹ 550–600 కోట్ల ఆర్థిక ప్రభావం ఉంటుందని అంచనా.

టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ (లండన్): పర్యాటక రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి, ప్రపంచ స్థాయిలో స్థానం కల్పించడానికి వ్యూహాత్మక సలహా (Strategic Advisory) సహకారం.

ఆసియాన్ రాయబారులు / పర్యాటక మంత్రిత్వ శాఖలు: సాంస్కృతిక సహకారం కింద ఆసియాన్ దేశాల అంతటా తెలంగాణలోని బౌద్ధ సర్క్యూట్‌ల ప్రచారం.
పర్యాటక పెట్టుబడులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సింగిల్-విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తోంది.

ఇవి కూడా చదవండి :

Telangana Rising Global Summit Investments : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంక‌ల్పం: మంత్రి పొంగులేటి