Punarnavi Bhupalam | ఎట్ట‌కేల‌కి కాబోయే వ‌రుడిని ప‌రిచ‌యం చేసిన అందాల ముద్దుగుమ్మ‌.. పెళ్లెప్పుడో మ‌రి..!

Punarnavi Bhupalam | ఏపీ తెనాలి ప్రాంతానికి చెందిన పునర్నవి భూపాల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌లు సినిమాల‌లో న‌టించి బిగ్ బాస్ అవ‌కాశం అందుకున్న ఈ భామ ఫుల్ పాపులారిటీ సంపాదించింది. చిన్న వయసులో విజ‌యవాడ, హైదరాబాద్ నగరాల్లో చదువుకుంది.

  • By: sn |    movies |    Published on : Dec 05, 2025 2:27 PM IST
Punarnavi Bhupalam | ఎట్ట‌కేల‌కి కాబోయే వ‌రుడిని ప‌రిచ‌యం చేసిన అందాల ముద్దుగుమ్మ‌.. పెళ్లెప్పుడో మ‌రి..!

Punarnavi Bhupalam | ఏపీ తెనాలి ప్రాంతానికి చెందిన పునర్నవి భూపాల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌లు సినిమాల‌లో న‌టించి బిగ్ బాస్ అవ‌కాశం అందుకున్న ఈ భామ ఫుల్ పాపులారిటీ సంపాదించింది. చిన్న వయసులో విజ‌యవాడ, హైదరాబాద్ నగరాల్లో చదువుకుంది. సైకాలజీ, జర్నలిజం లో డిగ్రీలు పూర్తి చేసిన ఆమెకు మొదటిసారిగా సైకాలజిస్టుగా మారాలని ఆకాంక్ష. అయితే కేవలం 17 ఏళ్లకే చదువును వదిలేసి, నటనపై ఉన్న ప్యాషన్ ఆమెను సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చింది. హీరోయిన్ పాత్ర కాకుండానే ఒక సహాయక పాత్రతోనే సినీ ప్రయాణం ప్రారంభించిన పునర్నవి, మొదటి చిత్రంతోనే తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయమైన పునర్నవి, పెద్దగా గ్లామర్ రోల్స్ కాకుండానే తనదైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో పాల్గొనడం ఆమె కెరీర్‌ను మరొక లెవెల్‌కి తీసుకెళ్లింది. షో తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో అవకాశాలు లభించాయి. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, పునర్నవి ఒక్కసారిగా సినీరంగాన్ని పక్కనపెట్టి విదేశాలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఫారిన్‌లో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్‌కు వస్తోంది.ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, రెగ్యులర్‌గా తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

అయితే ఆమె విదేశాల్లో ఉండటం వల్ల, ఒక ఫారినర్‌తో ప్రేమలో పడ్డారనే వార్తలు నెట్టింట కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్ల మధ్య పునర్న‌వి త‌న‌కి కాబోయే వ‌రుడిని ప‌రిచ‌యం చేసింది. త‌న ప్రియుడితో దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ… ‘నేను అత‌డికి ఎస్ చెప్పాను.’ అని ఆ ఫొటోల‌కి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇందులో పున‌ర్న‌వి ప్ర‌పోజ్ చేస్తున్న ఫోటో కూడా ఉంది.వ‌చ్చే ఏడాది వీరిద్ద‌రి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.