BRS Party | అలంపూర్ నుంచి అబ్ర‌హాం ఔట్.. గోషామ‌హ‌ల్ అభ్య‌ర్థిగా నంద కిషోర్‌ వ్యాస్‌

BRS Party | అలంపూర్ నుంచి అబ్ర‌హాం ఔట్.. గోషామ‌హ‌ల్ అభ్య‌ర్థిగా నంద కిషోర్‌ వ్యాస్‌

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టే దిశ‌గా ముందుకు వెళ్తుంది. ఇప్ప‌టికే ప్ర‌చారంలో దూసుకుపోతున్న అధికార పార్టీ.. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే 110 మంది అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ బీఫామ్స్ అందించారు. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు మిగిలిన 9 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. తెలంగాణ భ‌వ‌న్లో ఆ తొమ్మిది మందికి కేటీఆర్ బీఫామ్స్ అందించారు.

ఇక అలంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్ర‌హాంకు బీఆర్ఎస్ ఉద్వాస‌న ప‌లికింది. అబ్ర‌హాం స్థానంలో విజేయుడికి టికెట్ ఇచ్చింది. ఇక గోషామ‌హ‌ల్ స్థానాన్ని నంద కిషోర్ వ్యాస్‌కు క‌ట్ట‌బెట్టింది. నాంపల్లి అభ్యర్థిగా అనంద్‌ కుమార్ గౌడ్‌ను ఖ‌రారు చేసింది. ముస్లిం నియోజ‌క‌వ‌ర్గాలైన ఏడు స్థానాల‌కు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

9 స్థానాలు ఇవే..

1. చాంద్రాయణ గుట్ట -ఎం.సీతారాం రెడ్డి

2. యాకత్‌ పురా – సామా సుందర్‌ రెడ్డి

3. బహుదూర్‌ పుర – ఇనాయత్‌ అలీ బక్రీ

4. మలక్‌ పేట- తీగల అజిత్‌ రెడ్డి

5. కార్వాన్ – అయిందాల కృష్ణ

6. చార్మినార్ – సలావుద్దీన్‌ లోడి

7. నాంపల్లి – సీహెచ్ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌

8. గోషామహాల్ – నంద కిషోర్‌ వ్యాస్‌

9. అలంపూర్ – విజేయుడు