DSC Notification | డీఎస్సీ పోస్టులకు బీటెక్ – బీఈడీ అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు..
DSC Notification | తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఈడీ పూర్తి చేసిన బీటెక్ విద్యార్థులు కూడా టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
బీటెక్ విద్యార్థులకు 2015 నుంచి బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వందల మంది బీటెక్ విద్యార్థులు బీఈడీలో ప్రవేశం పొందుతున్నారు. 2017లో జరిగిన టెట్ రాసేందుకు కూడా వారికి అనుమతిచ్చారు. అప్పట్నుంచి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడలేదు. కొద్ది రోజుల క్రితం 5,089 టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ పోస్టులకు బీటెక్ – బీఈడీ అభ్యర్థులు పోటీ పడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు వారికి ఒకట్రెండు రోజుల్లో అవకాశం ఇవ్వనున్నారు. మొత్తంగా డీఎస్సీ దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram