• Telugu News
  • /News

కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం కలకలం రేపింది. తల్లి లయ (31)తోపాటు ముగ్గురు పిల్లలు శివ (13), బిందు (16), దివిజ (8) అదృశ్యమయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 11, 2026, 12:51 pm IST
Read Time: 2 mins
కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబంలోని భార్య, భర్తలు, ఇద్దరు పిల్లల అదృశ్యమైన ఘటన మరువకముందే.. కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం కలకలం రేపింది.

తల్లి లయ (31)తోపాటు ముగ్గురు పిల్లలు శివ (13), బిందు (16), దివిజ (8) అదృశ్యమయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన నలుగురి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.