భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంలో ఇంత పెద్ద బ్లండ‌ర్ మిస్టేక్ గ‌మ‌నించారా.. అలా ఎలా చేశారు..!

భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంలో ఇంత పెద్ద బ్లండ‌ర్ మిస్టేక్ గ‌మ‌నించారా.. అలా ఎలా చేశారు..!

అఖండ‌, వీర‌సింహారెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత బాల‌కృష్ణ న‌టించిన చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, అందాల భామ కాజల్ అగర్వాల్ నటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా, తొలి ఆట నుంచే సక్సెస్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తుంది. ఇక ఈ సినిమాని 100 కోట్ల రూపాయలతో మేక‌ర్స్ నిర్మించారు.దాదాపు 70 కోట్ల రూపాయల మేర భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో హాట్ కేక్‌లా బిజినెస్ జరగ‌డంతో నిర్మాత‌లు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇక ఇదిలా ఉంటే జ్ భగవంత్ కేసరి చిత్రంలో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లండర్ మిస్టేక్ చేసిన‌ట్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్‌గా మారింది.. విలేకరి ప్రశ్నతో అది వెలుగులోకి రాగా, అస‌లు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని జనాలు ముచ్చ‌టించుకుంటున్నారు. చిత్రంలో నటుడు శరత్ కుమార్ జైలర్ రోల్ చేయ‌గా, ఆయన కూతురిగా శ్రీలీల న‌టించింది. శరత్ కుమార్ ఓ ప్రమాదంలో మరణించడంతో శ్రీలీలను బాలకృష్ణ చేరదీస్తాడు.. అయితే శరత్ కుమార్ పాత్ర చనిపోయినప్పుడు ప్రమాదంలో సీఐ దుర్మరణం అని టీవీలో స్క్రోలింగ్ వైసారు. జైలర్ చనిపోతే సీఐ మరణం అని వేశారు, అది త‌ప్పు క‌దా అని అనీల్ రావిపూడిని మీడియా స‌మావేశంలో ప్ర‌శ్నించారు

అప్పుడు దానికి అనీల్ రావిపూడి స్పందిస్తూ.. అంత పెద్ద కమర్షియల్ మూవీలో మీరు ఇంత చిన్న తప్పును పట్టుకున్నారంటే… మీ సునిశిత పరిశీలనకు, సూక్ష్మ బుద్ధికి నిజంగా హ్యాట్సఫ్ అన్నారు. నిజంగా అది మా తప్పే. అందుకు క్షమాపణలు అని త‌న త‌ప్పుని ఒప్పుకున్నారు. ఇక ఇదే వేదిక మీద అనిల్ రావిపూడి ఓ రివ్యూవర్ పై మండిపడ్డాడు. ఆర్మీలో చేరడం లక్ష్యంగా ముందుకు వెళుతున్న కూతురిగా భగవంత్ కేసరిలో శ్రీలీల పాత్రను డిజైన్ చేశాము. కానీ ఓ రివ్యూవర్ శ్రీలీల పాత్రలో గ్లామర్, డాన్స్ యాంగిల్ మిస్ అని రాయ‌గా, అలా రాసింది ఎవరో నాకు తెలుసు. సినిమా చూసే అత‌ని దృష్టి ఎలా ఉందో అర్ధం అయితుంది అని ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు అనీల్ రావిపూడి. ప్ర‌స్తుతం ఈ మూవీ మిక్స‌డ్ టాక్‌తో బాగానే దూసుకుపోతుంది.