వామ్మో.. ఆరు పదుల వయస్సులో చిరంజీవి వర్కవుట్స్.. ఏంటి అంత కష్టం!

స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు. రాజకీయాలలోకి వెళ్లిన చిరు కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక సినిమాలు ఆచితూచి చేస్తున్నారు. గత ఏడాది భోళా శంకర్ రిజల్ట్ తో ఆయన రూటు మార్చినట్లు తెలుస్తోంది. భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఇప్పుడు తన తదుపరి సినిమాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు.
ఆరు పదుల వయస్సులోను చిరంజీవి ఎంతో కష్టపడుతున్నారు. పాత్రల కోసం తన బాడీని కూడా మలచుకుంటున్నాడు. మాస్ లుక్ అయినా.. క్లాస్ లుక్ అయినా ఇట్టే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి అందరికి షాక్ ఇస్తున్నాడు. త్వరలో చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి కథతో రానుందని తెలుస్తుంది. చిరంజీవికి 156వ సినిమా గా వస్తున్న ఈ సినిమాకి వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి చాలా ఫిట్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం జిమ్‌లో చాలా వర్కవుట్స్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది వీడియోలో చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
విశ్వంభర ఫాంటసీ సినిమా కావడంతో తన పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా బాడీని రెడీ చేస్తూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. చిరంజీవి పడుతున్న కష్టం చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. నిజంగా గ్రేట్ అంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తుండగా, ఈ మూవీని ఇదే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడని సమాచారం. తన కూతురు నిర్మాణంలోను చిరు ఓ మూవీ చేయనున్నాడు. రానున్న రోజులలో చిరు నుండి మంచి చిత్రాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.