గుంపులుగా వచ్చి గుద్దేశారట.. భారీ రిగ్గింగ్ ఎక్కడంటే
ఎంఐఎం నేతలు పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పు, యాకుత్‌పుర నియోజకవర్గాలలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది.

రిగ్గింగ్‌కు పాల్పడిన ఎంఐఎం శ్రేణులు
ఐడీ ప్రూఫ్ లేకుండా గుంపులుగా వచ్చి ఓటేశారు
సీసీ కెమెరాల్లో చూసి.. చర్యలు తీసుకోండి
కాంగ్రెస్ నేతలపై చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పుర, యాకుత్‌పురాలలో దాడి
పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు రాకుండా అడ్డుకున్నారు
ఎంఐఎంకు పోలీసులు, ఎన్నికల అధికారుల సహకారం
ఎంఐఎంపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడి
విధాత, హైదరాబాద్: ఎంఐఎం నేతలు పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పు, యాకుత్‌పుర నియోజకవర్గాలలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ రువాత గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నాలుగు నియోజకవర్గాలలో గ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేశారని ఆరోపించారు. చాంద్రాయణగుట్టలో తమ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారని చెప్పారు. తాము ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుకుంటే.. పాతబస్తీలో కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అక్కడ ఉన్న పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా తమ పోలింగ్ ఏజెంట్లను వెళ్లిపొమ్మన్నారని చెప్పారు.

మధ్యాహ్నం నుంచే రిగ్గింగ్
పోలింగ్ రోజు మధ్యాహ్నం నుండి అక్కడ బోగస్ ఓట్లతో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాతే కౌంటింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు. లేదంటే ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కు అనుమతి ఇవ్వకూడదని చెప్పామన్నారు. బీఎల్‌వోలు ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారని, ఐడీ ఫ్రూఫ్ లేకుండా ఓటరు స్లిప్పులు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి లేదని చెప్పారు. కానీ ఓల్డ్ సిటీలో ఎలాంటి స్లిప్పులు, ఐడీ ప్రూఫ్‌లు లేకుండా గుంపులుగా వెళ్లి ఓటు వేస్తూ రిగ్గింగ్ చేశారన్నారు.
ఓటరు స్లిప్పులు ఎక్కడ?
హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందనిన్న నిరంజన్.. ఓటర్ స్లిప్పులు పంచకపోతే ఎక్కడ ఓటేయాలో ఓటరుకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బందికి.. పోస్టల్ బ్యాలెట్ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దని, కానీ.. లక్షా 80 వేల మంది ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు. మిగిలిన వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీశారు. పాత నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రోజు విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఎం చేస్తున్నాయని ప్రశ్నించారు.