Congress Mlc: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. ఒక స్థానం సీపీఐకి

Congress Mlc: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. ఒక స్థానం సీపీఐకి

విధాత: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ తనకున్న ఎమ్మెల్యే ల సంఖ్య బలం మేరకు నాలుగు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇందులో ఒక స్థానం సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.అద్దంకి దయాకర్(ఎస్సీ), నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్(ఎస్టీ).. మాజీ ఎంపీ విజయశాంతి( బీసీ&మహిళ కోటా)లను అభ్యర్థులుగా ప్రకటించింది.

వీరు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ లకు సోమవారం చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన మార్చి 11 వరకు, ఉపసంహరణ మార్చి 13 వరకు ఉంది. పోలింగ్ మార్చి 20వ తేదీ నిర్వహించనుండగా అదే రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్సీలు.. మిత్రపక్షం సీపీఐకి ఒక ఎమ్మెల్యే బలం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 29 మంది( కాంగ్రెస్ లో చేరిన పదిమందిని మినహాయించి)ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు 7గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సీనియర్ నేత చాడ వెంకటరెడ్డికి అవకాశం దక్కవచ్చని సమాచారం.

ఎమ్మెల్యే కోటా సీట్ల కింద ఎమ్మెల్సీ ఎన్నికల ఫార్ములా ప్రకారం ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ మూడు స్థనాలు సులువుగా గెల్చుకోగలదు. బిఆర్ఎస్ ఒక్క స్థానంలో విజయం సాధించగలదు. అయితే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని కూడా రంగంలో దించిన పక్షంలో ఈ ఎన్నికలు ఉత్కంఠ గా మారనున్నాయి.

 

సిపిఐ కి ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించిన కాంగ్రెస్.

మగ్ధుమ్ భవన్ లో ప్రారంభమైన సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం. సిపిఐ ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో ఉన్న కామ్రేడ్ లు తక్కేల పల్లి శ్రీనివాస రావు,చాడ వెంకటరెడ్డి,నెల్లికంటి సత్యం,. మరి కొద్ది సేపట్లో అభ్యర్థి పేరును ప్రకటించనున్న సిపిఐ.