ఛాన్స్ ఇచ్చి తీసేసారు.. బాత్ రూంలో నోరు మూసుకొని ఏడ్చానంటూ దివి షాకింగ్ కామెంట్స్

  • By: sn    breaking    Mar 14, 2024 10:55 AM IST
ఛాన్స్ ఇచ్చి తీసేసారు.. బాత్ రూంలో నోరు మూసుకొని ఏడ్చానంటూ దివి షాకింగ్ కామెంట్స్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని రియాలిటీ షో బిగ్ బాస్.ఈ షో ద్వారా ఎంతో మందికి పాపులారిటీ ద‌క్కి సినిమా ఛాన్స్ లు కూడా వ‌చ్చాయి. అలాంటి వారిలో దివి కూడా ఒక‌రు.ఈ అమ్మ‌డు మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి మూవీలో చిన్న పాత్ర పోషించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి అనేక సినిమా ఆఫ‌ర్స్ అందుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది ఈ క్యూట్ భామ. దివి గ్లామ‌ర్‌కి ఫిదా కాని వారు లేరు.

దివి త‌న గ్లామ‌ర్‌తో ఎంత సంద‌డి చేసిన‌ప్ప‌టికీ సినిమా అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్ర‌మే వ‌స్తున్నాయి. ప్రస్తుతం దివి లంబసింగి అనే చిత్రంలో నటిస్తోంది. మార్చి 15న రిలీజ్ అవుతున్న ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, దివి కూడ చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈ క్ర‌మంలోనే త‌నకు అవ‌కాశాలు ఎందుకు రావ‌డం లేదో చెప్పుకొచ్చింది. నేను మోడ‌లింగ్ నుండి యాక్టింగ్ కి వ‌చ్చాన‌ని రిజెక్ట్ చేశారు. చేతిలోకి వ‌చ్చిన చాలా చిత్రాలు చేజారాయి. స‌న్న‌గా ఉన్నావ‌ని కొంద‌రు, లావుగా ఉన్నావ‌ని కొంద‌రు నాకు వ‌చ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేశారు.

అయితే నా కెరీర్ లో ఘోరమైన అనుభవం కూడా ఉంది. రవితేజ సినిమాలో నన్ను హీరోయిన్ గా ఫైనల్ చేసి క‌న్‌ఫాం చేశారు. మ‌రో ఐదు రోజుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. కాని రాత్రికి రాత్రే నన్ను తీసేసారు. ఆ స‌మ‌యంలో బాధ భ‌రించ‌లేక బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసుకుని తడుస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు బెడ్ రూమ్ లో దిండు అడ్డుపెట్టుకుని ఏడ్చేదాన్ని. అమ్మానాన్నలకు తెలిస్తే కుమిలిపోతారని సౌండ్ రాకుండా నాలో నేనే కుమిలిపోయే దానిని అంటూ దివి స్ప‌ష్టం చేసింది. ఇక త‌న‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కూడా తెగ ట్రోల్ చేస్తుంటారు. చిన్న చిన్న కార‌ణాల‌ని కూడా ఎత్తి చూపుతూ విమ‌ర్శిస్తుండ‌డం నాకు బాధ క‌లిగిస్తుంద‌ని దివి పేర్కొంది.