మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..!
రాష్ట్రంలో విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
15 నుంచి ఏప్రిల్ 23 వరకు క్లాస్ వర్క్ పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలు ఉన్న సెంటర్లలో మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత క్లాసులు నిర్వహించబడుతాయి.