సలార్‌లో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్ర పోషించింది ఆ హీరో కొడుకా?

బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు ఒక్క మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, సలార్ రూపంలో వారికి పసందైన వినోదం దక్కింది. సలార్ మూవీ డిసెంబర్ 22న విడుదల కాగా, చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నది అనే చెప్పాలి. తొలి రోజు 178 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం అనేక రికార్డులని కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అని ప్రచారం చేసినప్పటికీ సలార్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే సలార్ సినిమా డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులకి సంబంధించి వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
సలార్ సినిమాలో నటించిన ఒక కుర్రవాడు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో పృధ్వీ రాజ్ చిన్నప్పటి పాత్రను చేసిన కుర్రవాడు ఎవరు అని చాలా మంది ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటపడింది. విలన్ గా పృద్విరాజ్ చిన్నప్పటి పాత్ర చేసిన కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. మాస్ మహరాజా రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని, వరుసకి రవితేజకి కూడా కుమారుడే అవుతారట.ప్రస్తుతం కార్తికేయ దేవ్ పదవ తరగతి చదువుతున్నారు. పృద్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసి చివరికి కుర్రాడిని ఫైనల్ చేశాడట ప్రశాంత్ నీల్.
సలార్ సినిమా కోసం ఒక నెల రోజులపాటు రిహార్సల్ చేసిన తర్వాత కార్తికేయని ఫైనల్ చేసి అతడి షూటింగ్‌ని కేవలం 15 రోజులలో పూర్తి చేశారట. ఇదే విషయాన్ని రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు కార్తికేయ. ఇక చిత్రంలో లేడి విలన్‌గా కనిపించి నటించి మెప్పించింది శ్రియ రెడ్డి. ఈమె గురించి సౌత్ వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటె ఇంతకుముందే విశాల్ పొగరు సినిమాతో తాను నెగిటివ్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో సందడి చేస్తుందని నిరూపించుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన శ్రియా రెడ్డి సలార్‌లో కనిపించి రచ్చ చేసింది. ఈ చిత్రం చూసిన వారంతా శ్రియా రెడ్డిని చూస్తే నరసింహాలో రమ్యకృష్ణ.. అలానే బాహుబలిలో రమ్యకృష్ణ గుర్తొస్తోంది అని కామెంట్ చేస్తున్నారు.