కోరుకున్న వ్య‌క్తితో పెళ్లి జ‌ర‌గాలంటే.. ఆ మ‌హాశివుడిని మ‌ల్లెపూల‌తో పూజించాల‌ట‌..!

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో ‘శి’ అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, ‘వ’ అంటే మహిళల శక్తి అని అర్థం. కాబ‌ట్టి ఆ మ‌హాశివుడిని స్త్రీ, పురుషులిద్ద‌రూ పూజిస్తే ఎంతో పుణ్యం క‌లుగుతుంద‌ని, మ‌న‌కు అన్ని శుభాలు జ‌రుగుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కోరుకున్న వ్య‌క్తితో పెళ్లి జ‌ర‌గాలంటే.. ఆ మ‌హాశివుడిని మ‌ల్లెపూల‌తో పూజించాల‌ట‌..!

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో ‘శి’ అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, ‘వ’ అంటే మహిళల శక్తి అని అర్థం. కాబ‌ట్టి ఆ మ‌హాశివుడిని స్త్రీ, పురుషులిద్ద‌రూ పూజిస్తే ఎంతో పుణ్యం క‌లుగుతుంద‌ని, మ‌న‌కు అన్ని శుభాలు జ‌రుగుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక శివుడిని పూజించేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

పూజ చేసే స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

  • సోమ‌వారం తెల్ల‌వారుజామునే నిద్ర మేల్కొని, అభ్యంగ స్నానం చేయాలి. శుభ్ర‌మైన దుస్తులు ధ‌రించిన అనంత‌రం పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించాలి. పూజ చేసే స‌మ‌యంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది.
  • శివుడికి బిల్వ‌ప‌త్రం, మోదుగు పూలు స‌మ‌ర్పించాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తుల‌సి ఆకులు పెట్టి పూజించొద్దు. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి.
  • ఇక అబ్బాయిలు, అమ్మాయిలు తాము కోరుకున్న వ్య‌క్తులతో వివాహం జ‌ర‌గాలంటే ప్ర‌తి సోమవారం శివుడిని గుండ్ర‌టి మ‌ల్లెపూల‌తో పూజిస్తే త‌ప్ప‌కుండా కోరిక నెర‌వేరుతుంద‌ని పండితులు చెబుతున్నారు. శమీ పత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.
  • శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ భోళాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి.
  • శివలింగానికి అస‌లు కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి.