హెలికాప్టర్‌లో ఇంటర్ ప్రశ్నపత్రాల తరలింపు.. పారామిలటరీ బలగాల మధ్య పరీక్షా కేంద్రానికి..
సుక్మా జిల్లాలోని జగర్‌గుండా గ్రామానికి మాత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రశ్నపత్రాలు తరలించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన గ్రౌండ్ నుంచి పారా మిలటరీ బలగాల మధ్య పరీక్షా కేంద్రానికి ప్రశ్నపత్రాలను తరలించారు.
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా శనివారం నుంచి టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలిస్తున్నారు అధికారులు. అయితే సుక్మా జిల్లాలోని జగర్‌గుండా గ్రామానికి మాత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రశ్నపత్రాలు తరలించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన గ్రౌండ్ నుంచి పారా మిలటరీ బలగాల మధ్య పరీక్షా కేంద్రానికి ప్రశ్నపత్రాలను తరలించారు.
ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మన ఛత్తీస్‌గఢ్‌లో పిల్లల భవిష్యత్‌ను ప్రధాన అంశంగా తీసుకున్నాం. గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు, సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు మారుమూల గిరిజన గ్రామానికి హెలికాప్టర్‌లో ప్రశ్నపత్రాలు తరలించడం అభినందించదగ్గ విషయం. ఈ చొరవ తీసుకున్న అధికార యంత్రాంగాన్ని సీఎం విష్ణుదేవ్ సాయి అభినందించారని సీఎంవో తన ట్వీట్‌లో పేర్కొంది. నాణ్యమైన విద్య ఏ విద్యార్థికి కూడా దూరం కాకూడదు. విద్యార్థుల భవిష్యత్ కోసమే ఈ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపింది.
ఒక విద్యాసంవత్సరంలో 10, 12 తరగతులకు రెండు సార్లు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనను పాఠశాల విద్యాశాఖ చేసింది. ఫస్ట్ ఫేజ్ బోర్డు ఎగ్జామ్స్‌ను మార్చిలో, సెకండ్ ఫేజ్ బోర్డు ఎగ్జామ్స్‌ను జులైలో నిర్వహిస్తామని చెప్పింది.
यह है हमारा छत्तीसगढ़, जहां बच्चों के भविष्य की चिंता सबसे पहले की जाती है।
प्रदेश के दूरस्थ आदिवासी जिले सुकमा के जगरगुंडा के लिए हेलीकॉप्टर से भेजे गए प्रश्नपत्र।
उल्लेखनीय है, कि कल 1 मार्च से शुरू हो रही हैं बोर्ड परीक्षाएं।
मुख्यमंत्री श्री विष्णुदेव साय ने जिला प्रशासन के… pic.twitter.com/OnCRXISLp9— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) February 29, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram