Site icon vidhaatha

క‌న్ఫ్యూజ‌న్‌లో నోరు జారిన జాన్వీ క‌పూర్.. ఎట్ట‌కేల‌కి ప్రియుడి పేరు చెప్పేసిందిగా..!

శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల క‌న్నా కూడా గ్లామ‌ర్ షోతోనే జాన్వీ క‌పూర్ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందిపుచ్చుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో క‌నిపిస్తూ కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తూ ఉంటుంది జాన్వీ.న గత కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ వ్య‌క్తితో ప్రేమలో ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో జాన్వీ క‌పూర్ ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారాలు జ‌రిగాయి. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. వారు ఇద్ద‌రు క‌లిసి పార్టీలు , ప‌బ్బులు, గుళ్లు తిరుగుతూ కెమెరాల కంట ప‌డుతున్నారు.

ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కూడా చేసుకున్నారు. ఇలా ప‌లుమార్లు క‌లిసి క‌నిపించే స‌రికి వారిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే అనుమానాలు అంద‌రిలో మొద‌ల‌య్యాయి. అయితే అనుకోకుండా జాన్వీ క‌పూర్ త‌న ప్రేమాయ‌ణంపై ఓ షోలో నోరు విప్పింది. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ పాపుల‌ర్ టాక్ షో కాఫీ విత్ క‌ర‌ణ్‌కి జాన్వీ క‌పూర్ త‌న చెల్లెలు ఖుషీ కపూర్ తో క‌లిసి పాల్గొంది. ఇద్దరు ఈ షోలో తెగ అల్లరి చేశారు. అంతే కాదు ఇద్దరు కలిసి కరణ్ ను ఆటపట్టించ‌డం కూడా చేశారు. అయితే షో మంచి జోరు మీద ఉన్న టైమ్ లో సడెన్ గా కన్ ఫ్యూజ్ చేసి.. కరణ్ జోహార్ ఓ ప్రశ్న అడిగాడు.

నీ స్పీడ్‌ డయల్‌ లిస్టులో ఉన్న ముగ్గురి పేర్లు చెప్పు..?” అంటూ క‌ర‌ణ్ ప్ర‌శ్నంచ‌గా, దానికి జాన్వీ బదులిస్తూ.. ”పప్పా, ఖుషూ, షికూ” అని చెప్పారు. మొదటి రెండు పేర్లు ఆమె తండ్రి, చెల్లెలకు సంబంధించినవి కాగా, మూడో పేరు శిఖర్‌ పహారియాది అని, అత‌నిని ముద్దుగా షికూ అని జాన్వీ పిలుచుకుంటుంద‌ని తెలుస్తుంది. అయితే పేరు చెప్పిన‌ప్పుడు టంగ్ స్లిప్ అయ్యాను అన్న‌ట్టుగా బిహేవ్ చేసింది. కరణ్ జోహార్ ఆ సమాధానం రాగానే నవ్వుతూ ఎగిరి గంతులేసేశారు.తాజాగా టాక్ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఫుల్ ఎపిసోడ్ వ‌స్తే కాని జాన్వీ ఏం చెప్పిందో ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.క‌న్ఫ్యూజ‌న్‌లో నోరు జారిన జాన్వీ క‌పూర్.. ఎట్ట‌కేల‌కి ప్రియుడి పేరు చెప్పేసిందిగా..!

Exit mobile version