వైజాగ్‌లో బుమ్రా విశ్వ‌రూపం.. రెండో రోజు భార‌త్‌దే హ‌వా..!

  • By: sn    breaking    Feb 03, 2024 12:49 PM IST
వైజాగ్‌లో బుమ్రా విశ్వ‌రూపం.. రెండో రోజు భార‌త్‌దే హ‌వా..!

ప్ర‌స్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గగా, ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి పాలైంది. ఈ ఓట‌మికి బ‌దులు తీర్చుకోవాల‌ని భావించిన టీమిండియా రెండో టెస్ట్‌లో విజృంభిస్తుంది.ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా.. 6 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ వికెట్ తీయడం ద్వారా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 34 టెస్ట్‌ల్లో 150 వికెట్లు పడగొట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా.. రెండో ఆసియా క్రికెటర్‌గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(6/45) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది.

ఇంగ్లండ్ జ‌ట్టులో ఎవ‌రు కూడా పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయారు. ఆ జట్టులో జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. మూడో రోజు ఐదు ఓవ‌ర్స్ ఆడిన భార‌త్ వికెట్ కోల్పోకుండా 28 ప‌రుగులు చేసింది. జైస్వాల్ 15 నాటౌట్, రోహిత్ శ‌ర్మ 13 నాటౌట్‌తో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్స్ ఎంత వ‌ర‌కు ఆడి ఇంగ్లండ్‌ని క‌ట్టడి చేస్తార‌న్న‌ది చూడాలి.

ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా హైలైట్ అని చెప్పాలి. 27 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 150 వికెట్లు పడగొట్టి బుమ్రా కన్నా ముందున్నాడు. బుమ్రా తర్వాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలు రాయి అందుకున్నారు. టెస్ట్‌ల్లో బుమ్రాకు ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 10వ సారి. సఫారీ గడ్డపై మూడు సార్లు, వెస్టిండ్‌ గడ్డపై 2 సార్లు, ఇంగ్లండ్ గడ్డపై 2 సార్లు, భారత గడ్డపై రెండు సార్లు.. ఆసీస్ గడ్డపై 2 సార్లు బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.