శ్రీలంక‌పై న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం.. పాక్ సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టేనా..!

శ్రీలంక‌పై న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం.. పాక్ సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టేనా..!

ప్ర‌స్తుతం వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 హోరాహోరీగా సాగుతుంది. ఇప్ప‌టికే భార‌త్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కి చేరుకోగా నాలుగో స్థానంలో ఎవ‌రు నిలుస్తారో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మ‌ధ్య పోటీ నెల‌కొని ఉండ‌గా, ఈ స్థానాన్ని న్యూజిలాండ్ దాదాపు ఖరారు చేసుకుంది అని చెప్పాలి.. 9 మ్యాచ్‌లకు 5 గెలిచిన న్యూజిలాండ్.. మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్ బెర్త్‌కి చాలా దగ్గ‌రైంది. శ్రీలంకతో గురువారం జరిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింఇ. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక‌ను 171 పరుగులకే క‌ట్ట‌డి చేసిన న్యూజిలాండ్.. అనంతరం 23.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించ‌డంతో ఆ జట్టు మెరుగైన ర‌న్ రేట్ సొంతం చేసుకుంది.

అయితే ఆఫ్ఘ‌నిస్తాన్, పాకిస్తాన్ చివ‌రి మ్యాచ్‌ల‌లో గెలిచిన కూడా ర‌న్‌రేట్ న్యూజిలాండ్ క‌న్నా కూడా త‌క్కువే ఉంటుంది. పాక్ సెమీస్ చేరాలి అంటే ఇంగ్లండ్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి ఆ స్కోరుని 2.3 ఓవర్లలో చేధించాల్సి ఉంటుంది.ఇవి రెండు అసాధ్య‌మే కాబ‌ట్టి న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిల‌వ‌డం ఖాయం. ఇక సెమీస్‌లో భార‌త్, న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నుండ‌గా మ‌రోవైపు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పోటీప‌డ‌నున్నాయి. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అలానే 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

న్యూజిలాండ్ సెమీస్‌కి చేరుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసిన కేన్ మామ‌..హోట్‌టీమ్‌తో సెమీస్‌లో త‌ల‌ప‌డాల్సి రావడం బిగ్ ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామ‌ని అన్న కేన్ .. మాకు అదృష్టం కలిసి వస్తే అన్నీ మాకు అనుకూలంగానే జరుగుతాయి అని అన్నారు. మ‌రి న్యూజిలాండ్‌పై భార‌త్‌కి పెద్ద‌గా స‌క్సెస్ లేక‌పోగా, సెమీస్‌లో ఎంత వ‌రకు రాణిస్తారో చూడాల్సి ఉంది.