వారికి బిర్యానీ వ‌డ్డించిన న‌య‌న‌తార‌… ఆ త‌ర్వాత ఏం చేసింది అంటే.!

  • By: sn    breaking    Dec 05, 2023 10:29 AM IST
వారికి బిర్యానీ వ‌డ్డించిన న‌య‌న‌తార‌… ఆ త‌ర్వాత ఏం చేసింది అంటే.!

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క్రేజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌కి స‌మానంగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంది.గ్లామరస్ పాత్రలు చేయడంతో పాటు ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేస్తూ అల‌రిస్తుంది న‌య‌న‌తార‌. నయనతార రీసెంట్ గా ‘ అన్నపూరణి’. ది గాడెస్ ఆఫ్ పుడ్ అనేది ఉపశీర్షికగా కలిగి ఉన్నచిత్రంలో న‌టించారు. ఇందులో జై మ‌రో ముఖ్య పాత్ర పోషించారు. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇండియన్ బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనే క‌థ‌తో మూవీ రూపొంద‌గా, ఈ మూవీకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మూవీ మంచి సక్సెస్ కావ‌డంతో మూవీ టీమ్ అంతా చెన్నైలోని ఓ లేడీస్ కాలేజిని సందర్శించి అక్కడే సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. హీరోయిన్ నయనతారతో పాటు హీరో జై కూడా వారి కాలేజీకి రావడంతో..అక్కడ స్టూడెంట్స్ ఆనందంతో కేరింతలు కొట్టారు. సెలబ్రిటీస్ ను చూడటానికి తెగ పోటీ పడ్డారు. ఇక స్టూడెంట్స్‌తో క‌లిసి వారు లంచ్ కూడా చేశారు. విద్యార్ధులతో కొద్ది సేపు ముచ్చ‌టించారు.

అనంత‌రం వారికి స్వ‌యంగా బిర్యానీ వ‌డ్డించింది న‌య‌న‌తార‌. దీంతో విద్యార్ధుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. సాధార‌ణంగా ఎప్పుడు మూవీ ప్రచారాలకు దూరంగా ఉండే నయనతార ఇప్పుడిలా ఓ కాలేజ్ కి వెళ్లి విద్యార్ధుల‌తో క‌లిసి సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక నయనతార ప్ర‌స్తుతం డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న టెస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు.మ‌రోవైపు తెలుగులోను ప‌లు సినిమాల‌కి క‌మిటైన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం న‌య‌న‌తార తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కి జ‌త‌గా న‌టిస్తుంది.