బంగ్లాపై మంచి విజయం సాధించిన పాక్.. సెమీస్‌కి వెళ్లే అవకాశం ఉందా?

వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని అందరు భావించిన ఆ జట్టు మాత్రం ఆ తీవ్ర నిరాశపరుస్తుంది. వరుసగా నాలుగు ఓటములు చవిచూడడంతో వరల్డ్ కప్‌లో పాక్ కథ ముగిసిందని అందరు భావించారు. కాని మంగళవారం బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయంటున్నారు. బంగ్లాపై సాధించిన విజయంతో పాకిస్థాన్ జట్టు టేబుల్‌లో అఫ్గాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానంలో నిలిచింది. ఇక వరుస పరాజయాలు చవి చూసిన బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో 6 ఓడిన బంగ్లాదేశ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా కూడా సెమీస్ చేరే అవకాశం కష్టం.
తాజా విజయంతో పాకిస్థాన్ ఖాతాలో 6 పాయింట్లు చేరగా, ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి పటిష్ట టీమ్స్‌తో ఆ జట్టు తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ విజయం సాధిస్తే కనుక ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరాలి అంటే మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది. పట్టికలో 8 పాయింట్లతో మూడు, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవాలి. అలానే మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్ కూడా తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు ఓడిపోవాలి. అప్పుడు ఆ మూడు జట్లు 8 పాయింట్స్ తో ఉండి పాక్ 10 పాయింట్లతో ఉంటే సెమీస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
బంగ్లాపై మంచి విజయం సాధించిన పాక్.. సెమీస్‌కి వెళ్లే అవకాశం ఉందా?ఒకవేళ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ గెలిచి 10 పాయింట్లు సాధించి పాకిస్థాన్‌తో సమంగా నిలిస్తే మాత్రం అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. అయితే పాక్ మాత్రం తన తర్వాత తన రెండు మ్యాచ్‌లని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. ఇక తాజా మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించడంతో బంగ్లా 200 పరుగుల మార్క్ చేరుకుంది. ఇక లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసి 105 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఫకార్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీలతో మెరిసారు.