Viral Video | టీవీ స్టూడియోలో ర‌ణ‌రంగం.. లైవ్‌లోనే కొట్టుకున్న లీడ‌ర్లు

Viral Video | టీవీ స్టూడియోలో ర‌ణ‌రంగం.. లైవ్‌లోనే కొట్టుకున్న లీడ‌ర్లు

Viral Video | చ‌ర్చా వేదిక‌ల్లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య వాడివేడి చ‌ర్చ జ‌రగ‌డం స‌హ‌జ‌మే. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో దూషించుకుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో దాడుల‌కు కూడా వెనుకాడ‌రు. లైవ్‌లోనే కొట్టుకుంటారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చాలానే చూశాం. తాజాగా ఓ టీవీ స్టూడియోలో లైవ్ కొన‌సాగుతుండ‌గానే ఇద్ద‌రు లీడ‌ర్లు కొట్టుకున్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ స్టూడియో నిర్వ‌హిస్తున్న క‌ల్ త‌క్ టాక్ షో ఫేమ‌స్. ఈ షోలో పాక్ రాజ‌కీయాల‌పై జావేద్ చౌద‌రి అనే జ‌ర్న‌లిస్టు చ‌ర్చలు నిర్వ‌హిస్తుంటారు. అయితే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్స‌ఫ్‌(PTI) పార్టీకి చెందిన షేర్ అఫ్జ‌ల్ మార్వ‌త్‌ను, పాకిస్తాన్ ముస్లిం లీగ్ న‌వాజ్(PML-N) పార్టీకి చెందిన అఫ్న‌న్ ఉల్లాహ్‌ను చ‌ర్చ‌కు పిలిచారు.

ఈ చ‌ర్చ సంద‌ర్భంగా అఫ్న‌న్‌ ఉల్లాహ్‌.. పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మిలిట‌రీతో ఇమ్రాన్ ఖాన్ ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని పేర్కొన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన మార్వ‌త్‌.. అఫ్న‌న్‌పై దాడి చేశారు. త‌ల‌పై చేయితో బాదారు. ఇద్ద‌రు కొట్టుకున్నారు.

జ‌ర్న‌లిస్టు జావేద్ వారిద్ద‌రిని విడిపించే ప్ర‌య‌త్నం చేశారు. స్టూడియో సిబ్బంది ఇద్ద‌రిని స‌ముదాయించారు. ఇక నాయ‌కులు లైవ్‌లోనే కొట్టుకున్న ఇప్పుడు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.