ప్రియాంక త‌ల్లికి క్యాన్స‌ర్.. బిగ్ బాస్‌కి పోయి త‌ప్పు చేశానంటూ క‌న్నీరు మున్నీరు

ప్రియాంక త‌ల్లికి క్యాన్స‌ర్.. బిగ్ బాస్‌కి పోయి త‌ప్పు చేశానంటూ క‌న్నీరు మున్నీరు

బిగ్ బాస్ సీజ‌న్ 7లో లేడి కంటెస్టెంట్ అయిన ప్రియాంక జైన్‌.. అబ్బాయిల‌కి ఎంత ట‌ఫ్ ఫైట్ ఇచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ అమ్మ‌డు సీరియల్ యాక్టర్ గా అందరికి సుపరిచితమే. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత ఆమెకి మంచి పాపులారిటీ ద‌క్కింది. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్.. బిగ్ బాస్ హౌజ్‌లో మొద‌ట్లో వంట‌లక్క‌గా పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఆడ‌పులిలా చెల‌రేగిపోయింది.త‌న గురించి మాట్లాడే వారితో గ‌ట్టిగా మాట్లాడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రియాంక టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు ద‌క్కించుకుంది.

అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్న ప్రియాంక జైన్.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక విష‌యాలు తెలియ‌జేస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌ను బిగ్ బాస్ షోకు వెళ్లి తప్పు చేశాను అంటూ ఏడుస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది. బిగ్ బాస్ షో త‌ర్వాత త‌న లైఫ్ చాలా మారిపోతుంద‌ని ప్రియాంక జైన్ అనుకుంద‌ట‌. కానీ అందుకు భిన్నంగా జరిగిందట. తాజాగా తన తల్లికి సర్జరీ జరిగినట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా త‌న త‌ల్లికి నెలసరి ఎక్కువ అవు తుంద‌ని, వయసు పెరుగుతుండడం వల్ల జరిగే మార్పులతో బ్లీడింగ్ ఎక్కువ జ‌రుగుతుంద‌ని అంద‌రం అనుకున్నాం. కాని ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన తల్లికి ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ షోలో న‌న్ను చూడాల‌ని ఆసుప‌త్రిలో అడ్మిట్ కాలేదు. మా నిర్ల‌క్ష్యం వ‌ల‌నే అమ్మ‌కు ఇలా జ‌రిగింది. బిగ్ బాస్ షోకి నేను పోక‌పోయిన బాగుండేది. అమ్మని చాల బాగా చూసుకునే దానిని అని ప్రియాంక ఏడుస్తూ తెలియ‌జేసింది. అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిపింది.ఇక . తన తల్లిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లే సమయంలో ప్రియాంక చాలా ఎమోష‌న‌ల్ అయింది. స‌ర్జరీ పూర్త‌య్యాక ఊపిరి పీల్చుకుంది. డిశ్చార్జ్ అయినా తర్వాత తన తల్లిని ఇంటికి తీసుకువెళ్ళింది. ప్రియాంక త‌ల్లి ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట ప‌డాల‌ని, ఆమె క్షేమంగా ఉండాల‌ని ప్రియాంక అభిమానులు ప్రార్ధిస్తున్నారు.