జీవిత చెప్పినట్టు నేను ఆడను… నేను చెప్పినట్టే జీవిత ఆడుతుందంటూ రాజశేఖర్ కామెంట్స్

టాలీవుడ్ క్రేజీ జంటలలో రాజశేఖర్, జీవిత జంట ఒకటి. ఒకప్పుడు వీరిద్దరు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించారు. సినిమాలు చేసే సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించింది జీవిత. ఇక రాజశేఖర్ మాత్రం ఇప్పటికీ ఏదో రకంగా అలరిస్తూనే ఉన్నాడు. ఆయన తాజాగా నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డినరీలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్‌గా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్‌కి హాజరైన రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలోని జీవిత,జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో.. అది అద్భుతంగా క్లిక్ అయింది.. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేదు..
ఈ డైలాగ్ స్పాట్‌లో రాసి.. వక్కంతం వంశీ గారు నాకు కథ చెప్పారు.. బాగా నచ్చింది.. నాకు బాగా నచ్చడంతోనే ఈ పాత్రను చేశాను.. ఎలా ఉంటుందో ఆడియెన్స్ చూసి చెప్పాలి.. ఇక జీవిత గురించి చెప్పాలంటే.. .’జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను.. జీవిత చెప్తే నేను ఆడతాను అని అందరూ అనుకుంటారు. అయితే నిజంగా జరిగేది అది కాదు. నేను ఏం చేస్తే జీవిత అలా ఆడుతుంది.. జీవిత చెప్పింది కూడా నేను వింటాను.. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి గురించే. నాకు ఈచిత్రంలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ముఖ్యంగా హీరో నితిన్‌ను బయట చూసి ఆకతాయి అనుకున్నా.. సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు కదా? అందుకే అలా అనుకున్న కానీ సెట్స్‌లో హీరోగా, నిర్మాతగా అన్నీ ఎంతో బాధ్యతతో చూసుకున్నాడు.. శ్రీలీల, నేను ఇద్దరం ఎంబీబీఎస్ చదివాం.. అయితే శ్రీలీల ఒక కండీషన్ పెట్టింది.. డాక్టర్ చదువు గురించి ప్రశ్నలు వేయద్దు అని అన్నారు.. అందుకే నేను వాటి గురించి మాట్లాడలేదు.. సినిమాను చూసి ఎలా ఉందో చెప్పండి అని రాజశేఖర్ అన్నారు.
అనంతరం జీవిత మాట్లాడుతూ..భార్యాభర్తలన్న తరువాత ఒకరిమాట ఒకరు వినాలి .. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకోవాలి .. మా జీవితం అలానే సంతోషంగా సాగింది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ .. మా ఆయన .. నా ఇద్దరు పిల్లలు .. వాళ్లే నా ప్రపంచం. వాళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాతో నితిన్, శ్రీలీల ఈ వారం థియేటర్లో సందడి పంచనున్నారు. ఆదికేశవ ఫ్లాప్ తర్వాత శ్రీలీల ఈ మూవీతో పలకరించనుంది. నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తరువాత వక్కంతం వంశీ ఈ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సారి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నాడు వక్కంతం వంశీ . మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.