Viral Video | పిల్లి అనుకొని చేరదీసింది.. కానీ అది న‌ల్ల చిరుత అని తెలిసీ..

Viral Video | పిల్లి అనుకొని చేరదీసింది.. కానీ అది న‌ల్ల చిరుత అని తెలిసీ..

Viral Video | ఈ భూమ్మీద మూగ‌జీవాల‌ను ప్రేమించే వారు చాలా మందే ఉన్నారు. వారినే జంతు ప్రేమికులు అంటారు. జంతు ప్రేమికులు మూగ‌జీవాల‌ను ప్రేమిస్తూ.. వాటి సంర‌క్ష‌ణ కోసం నిరంత‌రం కృషి చేస్తుంటారు. ఆ మాదిరిగానే ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ కూడా మూగ జీవాల‌ను ప్రేమిస్తోంది. అచేత‌న స్థితిలో ప‌డి ఉన్న ఓ జంతువును పిల్లిగా భావించి, చేర‌దీసి పెద్ద చేసింది. కానీ అది పిల్లి కాదు అని తెలుసుకున్న త‌ర్వాత ఆమె షాకైంది. తాను ఇన్నాళ్లు పెంచింది ఓ న‌ల్ల చిరుతను అని తెలుసుకుని ఆశ్చ‌ర్యానికి గురైంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌ష్యాకు చెందిన ఓ జంతు ప్రేమికురాలు.. కొన్ని నెల‌ల క్రితం మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. అయితే రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్ల పొద‌ల్లో పిల్లి కూనలా ఉన్న ఓ జంతువు అచేత‌న స్థితిలో ఉండ‌టాన్ని ఆమె గ‌మ‌నించింది. ఇంకేముంది ఆ పిల్లిని చేరదీసి, ఇంటికి తీసుకొచ్చింది. త‌న పెంపుడు కుక్క మాదిరిగానే ఆ పిల్లిని కూడా పెంచింది. కానీ అది పిల్లి కాద‌ని, న‌ల్ల చిరుత‌(బ్లాక్ పాంథ‌ర్) అని కొన్ని నెల‌ల త‌ర్వాత ఆమెకు తెలిసింది.

దీంతో ఆ జంతు ప్రేమికురాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. బ్లాక్ పాంథ‌ర్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. అయితే న‌ల్ల చిరుత‌ను చేర‌దీసిన‌ప్ప‌టి నుంచి అది పెరిగి పెద్ద‌గ‌యి ఆడుకుంటున్న వ‌ర‌కు అన్నింటిని క‌లిపి ఆమె ఓ వీడియో చిత్రీక‌రించి, త‌న ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. 9.1 మిలియ‌న్ల మంది వీక్షించ‌గా, 14 ల‌క్ష‌ల మంది లైక్ చేశారు. ఈ జంతు ప్రేమికురాలి ఖాతాను 35 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్నారు.