సాయి ప‌ల్ల‌వితో సినిమా చేయాలంటే అన్ని కండీష‌న్స్ పెడుతుందా?

సాయి ప‌ల్ల‌వితో సినిమా చేయాలంటే అన్ని కండీష‌న్స్ పెడుతుందా?

మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతుంది. చేసింది త‌క్కువ సినిమాలే అయిన వాటితో మంచి పాపులారిటీ తెచ్చుకున్న లేడిప‌వ‌ర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ఫంక్ష‌న్స్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో దాదాపు సాయి ప‌ల్ల‌వికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకే ఆమెకి లేడి ప‌వర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు నాగ చైత‌న్య‌తో క‌లిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొని సంద‌డి చేసింది సాయి ప‌ల్ల‌వి. చైతూ, సాయి ప‌ల్ల‌వి క‌లిసి చేసిన ల‌వ్ స్టోరీ చిత్రం మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు తండేల్‌పై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇక సాయి ప‌ల్ల‌వితో సినిమా చేయాలంటే ఆమె దర్శక, నిర్మాతలకి పెట్టే కండీష‌న్స్ ఫాలో కావ‌ల్సిందేన‌ట‌. మొద‌ట ఈ అమ్మ‌డు తన పాత్రకి ప్రయారిటీ ఇవ్వాల‌ని చెబుతుంద‌ట‌. అలానే సినిమాలో తన పాత్ర చాలా ఇంపాక్ట్ గా ఉండేలా చూపించాల‌ని, అలానే చిత్రంలో బ‌ల‌మైన కంటెంట్ ఉండాల‌ని, సినిమా ప్రారంభానికి ముందే బౌండెడ్‌ స్క్రిప్ట్ ఉండాలని చెబుతుంద‌ట‌. ఇవే కాదు తాజాగా మ‌రో ఆస‌క్తిక‌రమైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాయి పల్లవితో సినిమా అంటే ముందుగానే వర్క్ షాప్‌ కూడా చేయాల్సి ఉంటుందట. వర్క్ షాప్‌లో సీన్లు ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, గెటప్స్, లుక్స్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్ గా ముందుగానే చూసుకోవాల‌ని ఈ అమ్మ‌డు చెబుతుంద‌ట‌.

వర్క్‌షాప్‌లో కూడా తాను పాల్గొని త‌గు సూచ‌న‌లు చేస్తుంద‌ట. వర్క్ షాప్‌లో తీయబోయే సీన్లకి సంబంధించి అన్ని రిహార్సల్స్ జరుగుతాయి కాబ‌ట్టి అప్పుడు త‌ప్పొప్పుల‌ని కూడా స‌రిచేసుకోవ‌చ్చనే ఉద్దేశంతో రిహార్స‌ల్‌లో త‌ప్ప‌క పాల్గొంటుంద‌ట‌. త‌ను న‌టించిన సినిమా మంచి హిట్ కావాల‌నే ఉద్దేశంతోనే సాయి ప‌ల్ల‌వి ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని అంటున్నారు. ఇక సాయిపల్లవి.. నాగచైతన్య కాంబోలో వ‌స్తున్న తండేల్‌ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో ఈ మూవీ రూపొందుతుంది. చివరగా సాయిపల్లవి.. తెలుగులో విరాటపర్వం చిత్రంలో నటించ‌గా, ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని చాలా నిరాశ‌ప‌ర‌చింది.