స్టేడియంకి వచ్చి శుభ్‌మన్ గిల్‌పై ప్రేమ బాణాలు విసిరిన సారా టెండూల్కర్

ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, జడేజా అద్భుతమైన క్యాచ్ లు పట్టడం, అలానే కోహ్లీ మెమోరబుల్ సెంచరీ చేయడం, హార్ధిక్ పాండ్యా గాయంతో బయటకు వెళ్లడం వంటివి జరిగాయి. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్.. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఫుల్ జోష్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి వచ్చింది. స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలియజేసింది.
శుభమన్ గిల్ క్యాచ్ పట్టినప్పుడు, ఆయన సిక్సర్స్ కొట్టినప్పుడు సారా చేసిన సందడి అంతా ఇంతా కాదు. సారా ఈ మ్యాచ్‌కి కేవలం గిల్ కోసమే వచ్చిందని కొందరు అంటున్నారు. కాగా, కొద్ది రోజుల నుండి సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ వారు ఏ మాత్రం స్పందించడం లేదు. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం..తమ ఫొటోలకు కామెంట్ చేసుకోవడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని కొందరు చెప్పుకొచ్చారు.తాజాగా జరిగిన మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సారా చేసిన సందడి చూసి వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొందరు గట్టిగా చెబుతున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం గిల్.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో కలిసి కాఫీ షాప్‌లో కనిపించాడు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, సారాకి బ్రేకప్ చెప్పాడని సోషల్ మీడియాలో ఫుల్ గాసిప్స్ వచ్చాయి. తాజాగా సారా గ్రౌండ్‌కి వచ్చి గిల్‌ని ఎంకరేజ్ చేయడం చూస్తే వారిద్దరి మధ్య బాండింగ్ అలానే ఉందని, త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కానున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా శుభ్‌మన్ గిల్ పెవీలియన్ చేరాడు.